Share News

పాముకాటుతో గొర్రెల కాపరి మృతి

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:05 AM

పాముకాటుకు గురై గొర్రెల కాప రి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.

పాముకాటుతో గొర్రెల కాపరి మృతి

దత్తిరాజేరు, జూన్‌ 3: పాముకాటుకు గురై గొర్రెల కాప రి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలోని భలభద్రరాజపురం గ్రామానికి చెందిన నక్కాన సూరయ్య (55) గొర్రెలు పెంచుతూ జీవనం సాగిస్తు న్నాడు. ఆదివారం గొబ్యాం గ్రామ పొలాల్లో గొర్రెలు మేపు తుండగా రాత్రి కురిసిన వర్షాలకు పొలంవద్దే ఉండిపోయాడు. ఈ క్రమంలో అక్కడ పాముకాటుకు గురయ్యాడు. తోటికాపర్లు స్థానిక పీహెచ్‌సీకి తరలించగా పరిస్థితి విషమించడంతో గజపతినగరం ప్రభు త్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడుకి భా ర్య ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:05 AM