Share News

నామినేషన్ల పరిశీలన పూర్తి

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:47 PM

ఎన్నికల ఘట్టంలో మరో తంతు పూర్తయింది. అభ్యర్థులు వేసిన నామినేషన్లను అధికారులు పరిశీలించి సరిగా లేనివాటిని శుక్రవారం తిరస్కరించారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు పూర్తి చేశారా లేదా.. అన్ని ధ్రువీకరణ పత్రాలూ ఉన్నాయా.. అఫిడవిట్లు సరిగా ఉన్నాయా.. ఫొటోలు, మద్దతుదారుల సంతకాలు, దరావతు, కొత్త బ్యాంక్‌ ఖాతా ఇలా అన్నింటినీ పరిశీలించి సరిగా ఉన్నవాటిని ఆమోదించారు.

నామినేషన్ల పరిశీలన పూర్తి

నామినేషన్ల పరిశీలన పూర్తి

నేటి నుంచి ఉపసంహరణలకు అవకాశం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల ఘట్టంలో మరో తంతు పూర్తయింది. అభ్యర్థులు వేసిన నామినేషన్లను అధికారులు పరిశీలించి సరిగా లేనివాటిని శుక్రవారం తిరస్కరించారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు పూర్తి చేశారా లేదా.. అన్ని ధ్రువీకరణ పత్రాలూ ఉన్నాయా.. అఫిడవిట్లు సరిగా ఉన్నాయా.. ఫొటోలు, మద్దతుదారుల సంతకాలు, దరావతు, కొత్త బ్యాంక్‌ ఖాతా ఇలా అన్నింటినీ పరిశీలించి సరిగా ఉన్నవాటిని ఆమోదించారు. లేని వాటిని తిరస్కరించారు. ఎక్కడ పొరపాటు ఉన్నా ఆ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు టెన్షన్‌ పడుతుంటారు. ఆమోదం తెలిపితే ఊపిరి పీల్చుకుంటారు. అలాగే ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు వేసి ఉంటే అసలు అభ్యర్థి నామినేషన్‌కు ఆమోదం లభించాక మిగిలిన వాటిని తొలగించాలని కోరుతుంటారు. ఇలా శుక్రవారం జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఆర్వోలు పూర్తి చేశారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం వరకు గడువుంది.

తిరస్కరించిన.. ఆమోదించిన నామినేషన్ల వివరాలిలా

---------------------------------------------------------------

నియోజకవర్గం తిరస్కరించినవి ఆమోదించినవి

--------------------------------------------------------

విజయనగరం 4 16

నెల్లిమర్ల 3 13

చీపురుపల్లి 5 8

రాజాం 2 10

బొబ్బిలి 4 9

గజపతినగరం 2 13

శృంగవరపుకోట 2 14

------------------

పార్లమెంట్‌కు 3 15

--------------

Updated Date - Apr 26 , 2024 | 11:47 PM