Share News

స్కూల్‌ బస్సు, ఆటో ఢీ

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:32 AM

మండలంలో అంతర్‌ రాష్ట్ర రహదారిపై విక్రాంపురం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ప్రైవేటు స్కూల్‌ బస్సు, విద్యార్థులతో వస్తున్న ఆటో ఢీకొన్నాయి.

 స్కూల్‌ బస్సు, ఆటో ఢీ

కొమరాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలో అంతర్‌ రాష్ట్ర రహదారిపై విక్రాంపురం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ప్రైవేటు స్కూల్‌ బస్సు, విద్యార్థులతో వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్‌కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి స్థానికుల సహాయంతో తరలించారు. జట్టు ఆశ్రమ విద్యార్థులు విక్రాంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాల విడిచిపెట్టిన అనంతరం విద్యార్థినులను ఆశ్రమానికి తీసుకువెళుతున్న ఆటో ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ హేమంత్‌తో పాటు ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పదో తరగతి చదువుతున్న దీవెన, తొమ్మిదో తరగతి చదువుతున్న సింధు, గీతాంజలికి తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. దీనిపై కొమరాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:32 AM