Share News

పైడిమాంబకు సారె

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:05 AM

సింహశైల సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం పైడిమాంబకు సారెని సమర్పించారు. వివిధ రకాల స్వీట్లు, పండ్లు, కాయగూర లను సమర్పించారు.

పైడిమాంబకు సారె

విజయనగరం రూరల్‌, జూలై 30: సింహశైల సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం పైడిమాంబకు సారెని సమర్పించారు. వివిధ రకాల స్వీట్లు, పండ్లు, కాయగూర లను సమర్పించారు. కోట వద్ద నుంచి మహిళా భక్తులు ఘాటాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు ముందు పులివేషాలు సందడి చేశాయి. థాసా డప్పులు ఊర్రూతలూగించాయి. కోట వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. అనంతరం పైడిమాంబ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకులు అవనాపు విజయ్‌, భార్గవి దంపతులతో పాటు, నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పైడిమాంబను దర్శించుకున్నారు. మరోవైపు అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం కావడంతో పైడి మాంబను వివిధ రకాల పువ్వులతో అలంకరించారు.

Updated Date - Jul 31 , 2024 | 12:05 AM