నేటి నుంచి పారిశుధ్య వారోత్సవాలు
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:35 PM
జిల్లాలో మంగళవారం నుంచి ఆగస్టు 2 వరకు పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
పార్వతీపురం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం నుంచి ఆగస్టు 2 వరకు పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రతిరోజూ చేపట్టిన కార్యక్రమాలను ఫొటోలతో పాటుగా తనకు పంపించాలన్నారు ఫాగింగ్ మిషన్లు సిద్ధం చేయాలని, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకు లను శుభ్రపర్చాలని, మంచినీటి నాణ్యత పరీక్షించాలని కలెక్టర్ తెలిపారు.