Share News

ఆరో తేదీలోగా జీతాలు చెల్లించాలి

ABN , Publish Date - May 27 , 2024 | 11:44 PM

మున్సిపాల్టీలో తమకు ఇవ్వవలసిన బకాయి జీతాలు చెల్లించకుంటే నిరవదిక సమ్మెకు వెళ్తామని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు ఎన్‌వై నాయుడు స్పష్టం చేశారు.

ఆరో తేదీలోగా జీతాలు చెల్లించాలి

సాలూరు: మున్సిపాల్టీలో తమకు ఇవ్వవలసిన బకాయి జీతాలు చెల్లించకుంటే నిరవదిక సమ్మెకు వెళ్తామని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు ఎన్‌వై నాయుడు స్పష్టం చేశారు. సాలూరులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బకాయి జీతాలు పూర్తిగా విడుదల చేయకుంటే జూన్‌ ఆరో తేదీ తర్వాత నిరవదిక సమ్మెకు వెళ్తామని తెలిపారు. అనంతరం తమ సమస్యలు పరి ష్కరించాలని సాలూరులో మున్సిపల్‌ మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్‌ కార్మికులు,ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:44 PM