Share News

ఓటుకు రూ.వెయ్యి

ABN , Publish Date - May 12 , 2024 | 11:33 PM

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ప్రలోభాల పర్వం ఆదివారం కూడా కొనసాగింది. పలు ప్రాంతాల్లో ఓటర్లకు నగదుతో పాటు మద్యం, సారాతో వల వేశారు. పట్టణాలు, పల్లెల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఈ తతంగం నడుపుతున్నారు.

ఓటుకు రూ.వెయ్యి

అధికార పార్టీ సేవలో మాజీ వలంటీర్లు

పార్వతీపురం, మే12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ప్రలోభాల పర్వం ఆదివారం కూడా కొనసాగింది. పలు ప్రాంతాల్లో ఓటర్లకు నగదుతో పాటు మద్యం, సారాతో వల వేశారు. పట్టణాలు, పల్లెల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఈ తతంగం నడుపుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ నిధుల నుంచి ఆదివారం ప్రతి ఓటుకు రూ.వెయ్యి అందించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రానుపోను చార్జీలు అందజేసి.. తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి ముందుగానే కొంతమంది వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలకు నగదును అందించారు. ఈ మేరకు వారు స్థానిక నాయకులు, కొంతమంది మాజీ వలంటీర్లతో కలిసి నగదు పంపిణీ చేపట్టారు. కొన్నిచోట్ల ఉదయం ఐదు గంటల నుంచే ఈ కార్యక్రమం చేపట్టారు. కొందరు మాజీ వలంటీర్లే అధికార పార్టీకి పంపిణీ ఏజెంట్లుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మరోవూపు జిల్లా కేంద్రం పార్వతీపురంతో పాటు 15 మండలాల్లో సారా ఏరులై పారింది. శనివారం సాయంత్రం నుంచే కొంతమంది వైసీపీ నేతలు సారా పంపిణీ చేపట్టారు. ముందస్తుగానే వ్యాపారులకు అడ్వాన్స్‌ రూపంలో కొంతమొత్తం ఇచ్చి సారాను వారు తెప్పించుకున్నారు. దానిని ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేశారు.

Updated Date - May 12 , 2024 | 11:33 PM