రోడ్డా.. చెరువా!
ABN , Publish Date - Jun 25 , 2024 | 11:30 PM
శృంగవరపుకోట పట్టణ పరిధిలోని విశాఖ-అరకు రోడ్డు చెరువును తలపించింది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడుపై వరద నీరు ఏరులా పారింది. స్థానిక దేవిబొమ్మ కూడలి నుంచి ఆకుల డిపో వరకు ఇదే పరిస్థితి. మోకాలిలోతు నీటిలో వాహనాలు నడిచాయి.
రోడ్డా.. చెరువా!
శృంగవరపుకోట పట్టణ పరిధిలోని విశాఖ-అరకు రోడ్డు చెరువును తలపించింది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడుపై వరద నీరు ఏరులా పారింది. స్థానిక దేవిబొమ్మ కూడలి నుంచి ఆకుల డిపో వరకు ఇదే పరిస్థితి. మోకాలిలోతు నీటిలో వాహనాలు నడిచాయి. ఇదే సమయంలో కళాశాలలు, పాఠశాలలను విడిచిపెట్టడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. దాదాపు గంట పాటు ఏకదాటిగా వర్షం పడింది. కాగా ఏమాత్రం వర్షం పడినా విశాఖ-అరకు రోడ్డులో వరద నీరు నిలుస్తుంది. కాలువలను దుకాణదారులు కప్పేయడంతో నీరు బయటకు వెళ్లకుండా రోడ్డుపై ఉండిపోతోంది. కాలువలు, మదుములపై ఆక్రమణలు తెరిపిస్తేనే ఈసమస్య తీరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
- శృంగవరపుకోట