Share News

స్మోక్‌ బిస్కెట్లతో ప్రాణాలకు హాని

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:49 PM

లిక్విడ్‌ నైట్రోజన్‌ని ఉపయోగించే స్మోక్‌ బిస్కెట్ల తో నోరు, గొంతు,అన్నవాహిక, కడుపులో తీవ్రమైన గాయాలు, శ్వాస తీసుకోవ డంలో సమస్యలు తలెత్తి ప్రాణాపాయం పొంచిఉంటుందని ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ నాగుల్‌మీరా హెచ్చరించారు. శనివారం విజయనగరంలోని రింగురోడ్డు జంక్షన్‌ వద్ద ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో ఫుడ్‌ కోర్టులను ఆకస్మిక తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్విడ్‌ నైట్రోజన్‌ శరీరంలోకి వెళ్లడం వల్ల ఆక్సిజన్‌ అందక, మనిషి ఉక్కిరిబిక్కిరి అవు తారన్నారు. అందుకే స్మోక్‌బిస్కెట్స్‌ తినొద్దని సూచించారు.ఆ స్టాల్‌ని సీజ్‌చేశారు. అనంతరం బజ్జీ స్టాల్‌ తనిఖీ నిర్వహించి కేసు నమోదుచేశారు.ఎక్కువసార్లు మరిగించిన నూనెతోమంచూరియా, బజ్జీలను వేయించడం వల్ల క్యాన్సర్‌, గుండె సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల న్నారు. హోటళ్లు, ఫుడ్‌ కోర్టులలో నిబంధనలకు విరుద్ధంగా ఆహారభద్రతా ప్రమా ణాలు పాటించకుండా విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే 87906 03489కు ఫోన్‌ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

 స్మోక్‌ బిస్కెట్లతో ప్రాణాలకు హాని
ఫుడ్‌కోర్టులో తనిఖీలు చేస్తున్న సేఫ్టీ ఆఫీసర్‌ నాగుల్‌మీరా:

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ నాగుల్‌ మీరా

విజయనగరం రింగురోడ్డు: లిక్విడ్‌ నైట్రోజన్‌ని ఉపయోగించే స్మోక్‌ బిస్కెట్ల తో నోరు, గొంతు,అన్నవాహిక, కడుపులో తీవ్రమైన గాయాలు, శ్వాస తీసుకోవ డంలో సమస్యలు తలెత్తి ప్రాణాపాయం పొంచిఉంటుందని ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ నాగుల్‌మీరా హెచ్చరించారు. శనివారం విజయనగరంలోని రింగురోడ్డు జంక్షన్‌ వద్ద ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో ఫుడ్‌ కోర్టులను ఆకస్మిక తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్విడ్‌ నైట్రోజన్‌ శరీరంలోకి వెళ్లడం వల్ల ఆక్సిజన్‌ అందక, మనిషి ఉక్కిరిబిక్కిరి అవు తారన్నారు. అందుకే స్మోక్‌బిస్కెట్స్‌ తినొద్దని సూచించారు.ఆ స్టాల్‌ని సీజ్‌చేశారు. అనంతరం బజ్జీ స్టాల్‌ తనిఖీ నిర్వహించి కేసు నమోదుచేశారు.ఎక్కువసార్లు మరిగించిన నూనెతోమంచూరియా, బజ్జీలను వేయించడం వల్ల క్యాన్సర్‌, గుండె సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల న్నారు. హోటళ్లు, ఫుడ్‌ కోర్టులలో నిబంధనలకు విరుద్ధంగా ఆహారభద్రతా ప్రమా ణాలు పాటించకుండా విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే 87906 03489కు ఫోన్‌ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఎన్‌ఈపీని నిలిపివేయాలి

విజయనగరం దాసన్నపేట: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం-2020(ఎన్‌ఈపీ) అమలును నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక, భారత నాస్తిక సమాజం జిల్లా కన్వీనర్‌ బంకురు జోగినాయుడు డిమాండ్‌ చేశా రు. శనివారం కోట సమీపంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యరంగాలను పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలని కోరారు. ప్రైవే టు, కార్పొరేట్‌ శక్తుల నుంచి రక్షించే విధంగా నూతనంగా అధికారం చేపట్ట బోతున్న కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:49 PM