Share News

తిరుగు ప్రయాణం

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:01 AM

: సంకాంత్రి కోసం ఎక్కడెక్కడి నుంచో సొంతూళ్లకు వచ్చిన వారంతా పండగ ముగియడంతో తిరిగి ఆ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.

తిరుగు ప్రయాణం
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ప్రయాణికుల రద్దీ

-స్వగ్రామాల నుంచి వేరే ప్రాంతాలకు బయల్దేరిన జిల్లావాసులు

- కిటకిటలాడిన ఆర్టీసీ కాంప్లెక్‌, రైల్వేస్టేషన్‌

విజయనగరం (ఆంధ్రజ్యోతి) జనవరి 17: సంకాంత్రి కోసం ఎక్కడెక్కడి నుంచో సొంతూళ్లకు వచ్చిన వారంతా పండగ ముగియడంతో తిరిగి ఆ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో బుధవారం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్‌ రద్దీగా కనిపించింది. విజయనగరం నుంచి విశాఖపట్నం, విజయవాడ వరకు వెళ్లే బస్సులు కిక్కిరిసి పోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సరిగ్గా బస్సులు రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చిన్నారులు, కుటుంబ సభ్యులతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. అరకొరగా వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు పోటీపడ్డారు. మొత్తంగా కిక్కిరిసుకుని, ఫుట్‌పాత్‌లపై నిలబడి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇంకొందరు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. వలస పక్షలు తిరుగు ప్రయాణమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి వివిధ ప్రాంతాలకు అదనంగా ఆర్టీసీ బస్సులు నడపాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:01 AM