Share News

సకాలంలో వినతులు పరిష్కరించండి: కలెక్టర్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:13 AM

ff

సకాలంలో వినతులు పరిష్కరించండి: కలెక్టర్‌
వినతులు స్వీకరిస్తున్నకలెక్టరు నాగలక్ష్మి :

కలెక్టరేట్‌: వినతులు సకాలంలో పరిష్కరించాలని కలెక్టరు నాగలక్షి ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటో రియంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అధికంగా భూసమస్యలపై వినతలు వచ్చాయి. వివిధ సమస్యలపై 199 వినతులు రాగా, వీటిల్లో 132 వినతలు భూసమస్యలపై ఉండడం విశేషం. కలెక్టరు నాగలక్ష్మి, జేసీ కార్తీక్‌, డీఆర్వో అనిత, ట్రైనీ కలెక్టరు త్రివాంగ్‌ వినతులు స్వీకరించారు. కాగా విజయనగరం బిట్‌ 1 తోటపాలెం పరిధిలో సర్వే నెం బరు 53-4, 53-5లో ఉన్న భూమిని వ్యవసాయభూమిగా ఎలా మార్చారో తెలియజేయాలని శ్రీసత్యసాయి సాయినగర లేఅవుట్‌ ప్లాట్లు యాజమా నులు దాట్ల విజయలక్ష్మి, జి.మోహనరావు, ఆర్‌కే ప్రసాద్‌ కోరారు. అధి కారులు స్పందించి వెబ్‌ల్యాండ్‌పెట్టిన సర్వేనెంబర్లను మార్పు చేయాలని విన్నవించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ తమ భూములు ఇచ్చామని, ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదని భోగాపురం మండలం లోని అమటాం రావివలస గ్రామానికి చెందిన ఏవీ రమణ, వెంటకలక్ష్మి, దాలి నాయుడు తదితరులు విన్నవించారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లాలోని ఇంటర్‌,పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వ హించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సమావేశం నిర్వ హించారు. ఈసందర్భం గా మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు 27,277 మంది విద్యార్థులకు 129 కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు చెప్పారు. పరీక్ష లు నిర్వహణకు 1600 మంది ఇన్విజలేటర్లు, తొమ్మిది మంది ఫ్లయింగ్‌ స్వాడ్‌లను నియమిస్తున్నట్లు తెలిపారు. 94 కేంద్రాల్లో 45,000 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారని చెప్పారు.నులిపురుగులను నిర్మూలనకు చర్యలు చేపట్టాలని కలెక్టరు నాగలక్ష్మి ఆదేశించారు. ఈనెల తొమ్మిదో తేదీన జాతీయనులిపురుగులు నివారణ దినోత్స వం పురస్కరిం చుకుని నులి పురుగులు నివారణ కోసం ఆల్బెండజోల్‌ మాత్రలను ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారికి మింగించాలని సూచించా రు. నవరత్నాలు పేదలందరికీ మంజూరైన స్థలాలు రిజిస్ర్టేషన్లు వేగంగా జరగాలని కలెక్టరు ఆదేశించారు. జిల్లాలోని 31 వేలు డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్‌కు సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా జర్నలిస్టు ఇళ్ల స్థలాలకు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు. తొలిదశగా 276 మంది జర్నలిస్టుల సమాచారాన్ని మండలాలకు పంపించామని చెప్పారు. కార్యక్రమంలోని జేసీ కార్తీక్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:13 AM