Share News

ఒప్పంద జీవోలు విడుదల చేయండి

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:55 PM

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై చర్చల్లో అంగీకరించిన ఒప్పందా లకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

  ఒప్పంద జీవోలు విడుదల చేయండి

బెలగాం: మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై చర్చల్లో అంగీకరించిన ఒప్పందా లకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సుం దరయ్య భవనంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయ కులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం మీద నమ్మకంతో సమ్మె విర మించి 15 రోజులు గడుస్తున్నా చర్చల్లో చేసుకున్న ఒప్పందాలకు సం బంధించి జీవోలు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నాయని ఆగ్రహించారు. ఇంకా కొన్ని జీవోలు ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్లో ఉండడంతో సమ్మె కాలంలో వేతనం చెల్లించ డంలో జాప్యం జరుగుతుందని అన్నారు. డ్రైవర్లకు రూ.24,500, దహన సంస్కార ఖర్చులు రూ.20వేలు చెల్లింపు, విధుల్లో చనిపోయినవారికి నష్టపరిహారం, బకాయిలు, సరెండర్‌ లీవ్‌లు, 23 శాతం వేతనం పెంపు తదితర ఒప్పందాలకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సోమ వారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నాలు చేస్తామని చెప్పారు. ఇంజి నీరింగ్‌ కార్మికులకు ప్రభుత్వం నియమించిన తొమ్మిది మంది కమిటీ వెంటనే స్కిల్డ్‌ సొసైటీ ద్వారా వేతనాలు అమలు ప్రారంభించాలని, ఈ మేరకు ఎమ్మెల్యే లకు వినతిపత్రం ఇస్తామని తెలిపారు. కాఫా ఆటో డ్రైవర్లు సమస్యలపై ప్రభు త్వం ఇచ్చిన హామీ ప్రకారం పరిష్కరించాలని లేదంటే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. సమ్మె అనుభవాలను వివరిస్తూ ముద్రించిన ప్రచార పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జి.వెంకటరమణ, యూనియన్‌ నాయకులు శంకర్రావు, రాముడు, సింహాచలం, శివ పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:55 PM