Share News

రేకుల షెడ్డే పశువైద్య కేంద్రం

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:02 PM

మండలంలోని కడకెల్ల గ్రామంలో 1986లో గ్రామీణ పశుగణాభివృద్ధి ఉప కేంద్రాన్ని ప్రారంభించారు.

రేకుల షెడ్డే పశువైద్య కేంద్రం
రేకులషెడ్‌లో విధులు నిర్వహిస్తున్న లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావు

వీరఘట్టం: మండలంలోని కడకెల్ల గ్రామంలో 1986లో గ్రామీణ పశుగణాభివృద్ధి ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజల సహకారంతో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరి గతేడాది జూన్‌లో కూలిపోయింది. గ్రామస్థులు ఎన్నిమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా కొత్త భవనానికి నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో పక్కనే ఉన్న రేకులషెడ్‌లో లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ జి.శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని పంచముఖ ఆంజనేయసేవా సమితి ఆధ్వర్యంలో నిధులను సేకరించి శిథిలమైన భవనం స్థానంలో కొత్తగా పునాదులను నిర్మించారు. అధికారులు నిధులు మంజూరు చేయకపోవడతో మిగిలిన పనులు కూడా నిధులను సేకరించి పూర్తి చేస్తామని సేవా సమితి సభ్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మండల పశువైద్యాధికారి చైతన్య శంకర్‌ వద్ద ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, నిధులు మంజూరైన వెంటనే కొత్త భవనం నిర్మిస్తామని తెలిపారు.

Updated Date - Jan 28 , 2024 | 11:02 PM