Share News

క్రమం తప్పకుండా గర్భిణులకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:50 AM

: గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో జగన్నాథరావు ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ ఎస్సార్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో భామిని, సీతంపేట మండలాలకు చెందిన పీహెచ్‌సీ వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సమీక్షించారు.

  క్రమం తప్పకుండా గర్భిణులకు వైద్య పరీక్షలు
వైద్యాధికారుల సమావేంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

సీతంపేట: గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో జగన్నాథరావు ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ ఎస్సార్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో భామిని, సీతంపేట మండలాలకు చెందిన పీహెచ్‌సీ వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సమీక్షించారు. ఆరోగ్య కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో నిర్వహించాలని ఆయన సూచించారు. గర్భిణులుగా నమోదైనప్పటి నుంచి ప్రసవం జరిగే వరకు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి ఆరోగ్య పర్యవేక్షణ చేయాలన్నారు. హీమోగ్లోబిన్‌, యూఇన్‌ అల్బుమిన్‌, షుగర్‌, అల్ర్టా సోసోగ్రఫీ, బ్లడ్‌ గ్రూప్‌, థైరాయిడ్‌, బీపీ, ఈసీజీ తదితర పరీక్షల నివేదికలు మాతా శిశు సంరక్షణలో కార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. కాన్పు తర్వాత శిశు ఆరోగ్య పర్యవేక్షణపై దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, డీఎంవో టి.జగన్మోహన్‌రావు, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి రఘుకుమార్‌, ఏపీడీ ప్రోగ్రాం అధికారి వినోద్‌, ఏపీడీమియాలజిస్ట్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:50 AM