Share News

పరస్పర కేసులు నమోదు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:14 AM

తన పొలంలో మొక్కజొన్న పంటను నాశనం చేసిన విష యంలో ప్రశ్నించడంతో తనపై దౌర్జన్యంచేసి కొట్టి, చంపుతానని బెదిరించినట్లు

పరస్పర కేసులు నమోదు

రాజాం రూరల్‌: తన పొలంలో మొక్కజొన్న పంటను నాశనం చేసిన విష యంలో ప్రశ్నించడంతో తనపై దౌర్జన్యంచేసి కొట్టి, చంపుతానని బెదిరించినట్లు మండల పరిధిలోని పొగిరి గ్రామానికి చెందిన లోలుగు సూర్యనారాయణ అదే గ్రామానికి చెందిన లోలుగు శంకర్రావుపై గురువారం రాత్రి రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తనకు చెందిన భూమిలో పదిసెంట్లు ఆక్రమించిన విష యం ప్రశ్నిస్తే.. తనను చేతులతో కొట్టి, చంపుతానని బెదిరించినట్లు మండల పరిధిలోని పొగిరి గ్రామానికి చెందిన లోలుగు శంకర్రావు తన తల్లితో కలిసి అదే గ్రామానికి చెందిన లోలుగు సూర్యనారాయణపై గురువారం రాత్రి రాజాం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు ఇచ్చిన పరస్పర ఫిర్యాదులపై కేసులు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజాం టౌన్‌ సి.ఐ. దాడి మోహనరావు తెలి పారు. ఈ ఘటనలు ఈనెల 2న పొగిరి గ్రామంలో జరిగినట్లు సి.ఐ. తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 12:14 AM