టీడబ్ల్యూ ఇంజనీరింగ్ ఈఈగా రమాదేవి
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:23 AM
సీతంపేట ఐటీడీ ఏ గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ రెగ్యులర్ ఈఈగా పి.రమాదేవి సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.
సీతంపేట రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీ ఏ గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ రెగ్యులర్ ఈఈగా పి.రమాదేవి సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఈఎన్‌సీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఈమెని పదోన్నతిపై సీతంపేట టీడబ్ల్యూ ఈఈగా బదిలీ చేస్తూ ఈఎన్‌సీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈమె 2009 నుంచి 2012 ఏడాదిలో శ్రీకాకుళం జిల్లా మందస డివిజన్‌లో ఇంజనీరింగ్ డీఈగా విధులు నిర్వర్తించారు. గతంలో రంపచోడవరం, కేఆర్ పురం ఐటీడీఏలో టీడబ్ల్యూ ఈఈగా అదనపు (ఎఫ్‌ఏసీ) బాధ్యతలు నిర్వహించారు. ఇంతవరకు సీతంపేట టీడబ్ల్యూ ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.సింహాచలం ఇకపై డీఈగా కొనసాగనున్నారు.