Share News

భక్తిశ్రద్ధలతో రంజాన్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:02 AM

జిల్లాలోని ముస్లింలు గురువారం రంజాన్‌ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

 భక్తిశ్రద్ధలతో రంజాన్‌
సాలూరు ఈద్గా వద్ద రంజాన్‌ ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

-మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు

పార్వతీపురంటౌన్‌/సాలూరు, ఏప్రిల్‌ 11: జిల్లాలోని ముస్లింలు గురువారం రంజాన్‌ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్‌ముబారక్‌ చెప్పుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలోని జామీయా మసీదులో ముతావళీ, జిల్లా ముస్లిం సంఘం అధ్యక్షుడు సయ్యుద్‌ ఇబ్రహీం ఆధ్వర్యంలో, సాలూరు రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న ఈద్గా స్థలంలో, సాలూరు మదరసాలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హానీఫ్‌, మౌలనా నూరుద్దీన్‌, హైదర్‌, షరూక్‌ఖాన్‌, తదితరులు మాట్లాడుతూ.. దాతృత్వానికి, సామరస్యానికి, క్రమశిక్షణకు ప్రతీక రంజాన్‌ అని అన్నారు. పేదలకు ఆదుకోవడానికి రంజాన్‌ మరింత దోహదపడుతుందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ముస్లిం తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రార్థనలు అనంతరం పేదలకు ఫితర్‌ దానాలు చేశారు. బంధుమిత్రులకు విందు ఇచ్చారు.

Updated Date - Apr 12 , 2024 | 12:02 AM