టీడీపీ ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షుడిగా రాజశేఖర్
ABN , Publish Date - Jan 20 , 2024 | 12:06 AM
టీడీపీ ప్రొఫెషనల్స్ వింగ్ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాళ్ల రాజశేఖర్ నియమితులయ్యారు.
నెల్లిమర్ల: టీడీపీ ప్రొఫెషనల్స్ వింగ్ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాళ్ల రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజశేఖర్ బీఎస్‌ఎఫ్ జవాన్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. తల్లి బంగారమ్మ నెల్లిమర్ల 18వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు చేయడంలో, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రాజశేఖర్ చురుగ్గా పనిచేశారు. దీంతో ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్ష పదవి వరించింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, నియోజకవర్గ ఇన్‌చాకరర్జి కర్రోతు బంగార్రాజు, సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్, కడగల ఆనంద్‌కుమార్, గేదెల రాజారావు, పతివాడ తమ్మినాయుడు తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.