Share News

రాజాం సమగ్ర అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - May 09 , 2024 | 12:14 AM

రాజాం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ స్పష్టం చేశారు. గత రెండు ఎన్నిక ల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేసిన ప్రజలు తప్పు చేశామని పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు.

రాజాం సమగ్ర అభివృద్ధే ధ్యేయం
రాజాం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌

- తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తా

- ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు

- టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌

(రాజాం)

రాజాం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ స్పష్టం చేశారు. గత రెండు ఎన్నిక ల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేసిన ప్రజలు తప్పు చేశామని పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో రాజాం నియోజకవర్గ ప్రజలు దారుణ వంచనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో తొలిసారిగా రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా తన సేవలను గుర్తు చేసుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాజాం ము నిసిపాల్టీతో పాటు రాజాం, సంతకవిటి, రేగిడి ఆమదాలవల స, వంగర మండలాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొం దించినట్టు తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

పట్టణాభివృద్ధికి ప్రణాళిక

రాజాం... ఉమ్మడి శ్రీకాకుళంతో పాటు నేటి విజయన గరం జిల్లాలో మంచి పట్టణం. అభివృద్ధికి అవకాశం ఉన్న పట్టణం. కానీ గత పదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యే ఎటువంటి అ భివృద్ధి చేయలేకపోయారు. నేను మంత్రిగా ఉన్న సమయం లోనే రాజాం పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందిన విష యాన్ని గుర్తుచేసుకోవాలి. గత ఐదేళ్లుగా రోడ్డు విస్తరణ పేరు తో కాలయాపన జరిగిందే కానీ.. అభివృద్ధికి ఎటువంటి ముం దడుగు పడలేదు. అందుకే ఎమ్మెల్యేగా ఎన్నికైన మరుక్షణం రాజాం పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తా. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.

పక్కా రహదారులకు...

నియోజకవర్గంలో రహదారుల సమస్య తీవ్రంగా ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వాణిజ్య కేం ద్రంగా ఉన్న రాజాంలోనే రహదారులు బాగాలేవు. నియోజ కవర్గంలోని నాలుగు మండలాల్లో లింకు రహదారులు ఉన్నాయి. అటు ప్రధాన రహదారులు సైతం అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటిని బాగుచేసేందుకు నడుం కడతా. ప్ర భుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పక్కా రహదారులు ఏర్పాటు చేస్తా.

సాగు..తాగునీటికి...

జిల్లాలో ఎక్కడా లేని సాగు, తాగునీటి వనరులు రాజాం నియోజకవర్గంలో ఉన్నాయి. తోటపల్లి, మడ్డువలస రిజర్వా యర్లతో పాటు నారాయణపురం ఆనకట్టకు సంబంధించి సాగునీటి కాలువలను ఆధునీకరిస్తాం. నియోజకవర్గంలోని శివారు ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. రాజాం పట్టణా నికి తాగునీటి ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రాజెక్టులను తీసుకొస్తా.

వైద్య సేవలపై...

రాజాం ప్రభుత్వాస్పత్రిలో వసతులు మెరుగుపరుస్తా. నేను వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఆస్పత్రి అప్‌గ్రేడ్‌ అయిన విషయం గుర్తించాలి. ఏరియా ఆస్పత్రిగా... ఈ ప్రాంతీయులకు సంజీవినిలా మార్చుతా. ఆస్పత్రుల్లో అదనపు భవన నిర్మాణాలతో పాటు వైద్యుల నియామకానికి కృషి చేస్తా. ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించడమే నా లక్ష్యం. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందితో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాను. ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందిస్తాం. ఇక్కడికి వచ్చిన రోగులకు వేరే ఆసుపత్రికి రిఫరల్‌ అన్నది లేకుండా అవసరమైన వైద్యసేవలు అందించేలా ప్రతి విభాగానికి వైద్య నిపుణులను నియమించేలా చర్యలు తీసుకుంటాను.

అందుబాటులో ఉంటా

ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటా. ప్రజలకు అంకిత భావంతో సేవలు చేస్తా. ఏ సమస్య వచ్చి నా ప్రజలకు అండగా ఉంటాను. 24 గంటలూ ఏ సమ యంలో అయినా నా దగ్గరకు రావచ్చు. ప్రజలకు సేవలు అందించడమే నా లక్ష్యం.

ఆదర్శంగా తీర్చిదిద్దుతా

నా ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు రుణపడి ఉంటాను. నియోజకవర్గ నాయ కులు, ప్రజలతో పాటు జనసేన, బీజేపీ నాయకులు కూడా నా విజయం కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాను. రాష్ట్ర భవిష్యత్‌ కోసం నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎంతో కష్టపడుతున్నారు. జిల్లాలోని రాజాం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.

పరిశ్రమలను తెరిపిస్తా...

రాజాం నియోజకవర్గంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించే ప్రయత్నం చేస్తా. సరైన ప్రోత్సాహం లేక పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు వీధిన పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాటికి ప్రోత్సాహకాలు అందేటట్టు చేస్తా. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తా. అందుకే ప్రజలు నాకొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.

Updated Date - May 09 , 2024 | 12:14 AM