Share News

గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలి

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:58 AM

గిరిజనులు సాగుచేస్తున్న భూములకు తక్షణం పట్టాలు పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమూ ర్తి డిమాండ్‌ చేశారు.

గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలి

సాలూరు: గిరిజనులు సాగుచేస్తున్న భూములకు తక్షణం పట్టాలు పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమూ ర్తి డిమాండ్‌ చేశారు. బొర్రపణుకువలస, జిల్లేడువలస గ్రామస్థులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో చేపడుతున్న నిరసన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. ఈ దీక్ష వద్దకు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గిరిజనులను మోసం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక తహసీల్దార్‌ ఎం.ఆనందరావు మాట్లాడుతూ మార్చి పదో తేదీ లోపు పట్టాలు పంపిణీ చేస్తామని, అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రి శ్రీను, కోరాడ ఈశ్వరరావు, ఎన్‌వై నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:58 AM