Share News

పొర్లు దండాలు పెట్టి..

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:06 AM

‘సీఎం జగన్‌.. నీకో దండం.. మా సమస్యలు పరిష్కరించవయ్యా! అంటూ శుక్రవారం పార్వతీపురంలో మున్సిపల్‌ కార్మికులు నినదించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులతో కలిసి పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు.

పొర్లు దండాలు పెట్టి..
పార్వతీపురంలో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు

పార్వతీపురం టౌన్‌/సాలూరు/పాలకొండ, జనవరి 5 : ‘సీఎం జగన్‌.. నీకో దండం.. మా సమస్యలు పరిష్కరించవయ్యా! అంటూ శుక్రవారం పార్వతీపురంలో మున్సిపల్‌ కార్మికులు నినదించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులతో కలిసి పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. కొద్ది రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేపడుతున్నా వైసీపీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెలా సక్రమంగా జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సాలూరు, పాలకొండలోనూ సమ్మె శిబిరం వద్ద పారిశుధ్య కార్మికులు పొర్లు దండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. వారికి టీడీపీ నేతలు గంటా సంతోష్‌కుమార్‌, బాబ్జీనాయుడు, అంపోలు శ్రీనివాస్‌, సుంకరి అనిల్‌, మాజీ కౌన్సిల్‌ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. మున్సిపల్‌ కార్మికుల పోరాటంలో పోరాటానికి భాగస్వాములవుతామన్నారు. సర్కారు స్పందించకుంటే శనివారం కార్మికులతో కలిసి మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడించనున్నామని సీఐటీయూ నాయకులు తెలిపారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:06 AM