Share News

కూలి గిట్టుబాటు కాలేదని నిరసన

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:21 AM

ఉపాధిహామీ పనుల కూలి గిట్టుబాటు కావడం లేదని దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన 450 మంది కూలీలు శనివారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

కూలి గిట్టుబాటు కాలేదని నిరసన

లక్కవరపుకోట (కొత్తవలస): ఉపాధిహామీ పనుల కూలి గిట్టుబాటు కావడం లేదని దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన 450 మంది కూలీలు శనివారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కొలతల పేరుతో కోతలు పెడుతున్నారన్నార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పనులకు 300 రూపాయలని పేర్కొని మోసం చేశారని మండిపడ్డారు. ఇటువంటి రేట్లతో ఎవరూ పనిచేయలేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి అలవెన్స్‌లు తీసివేసి రేట్లు పెంచినట్లు మసిబూసి మారేడుకాయ చేశారని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నేత గాడి అప్పారావు మండిపడ్డారు. సోమవారం కూలీలంతా ఎంపీడీవో కార్యాలయం ఎదుట తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

Updated Date - Apr 14 , 2024 | 12:21 AM