Share News

కౌంటింగ్‌ నిర్వహణకు చర్యలు

ABN , Publish Date - May 21 , 2024 | 11:51 PM

ఓట్లు లెక్కింపునకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు.

  కౌంటింగ్‌ నిర్వహణకు చర్యలు

గరుగుబిల్లి: ఓట్లు లెక్కింపునకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు. మంగళవారం ఉల్లిభద్ర పరిధిలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన కళాశాల ప్రాంతంలో కౌంటింగ్‌ నిర్వహణపై రెవెన్యూ సిబ్బందికి పలు ఆదేశా లను జారీ చేశారు. నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి జూన్‌ 4వ తేదీన లెక్కింపు జరగనుందని, లెక్కింపు సమయంలో అసౌకర్యం కలగకుండా ఉండేలా దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల నియమావళిని అనుసరించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రాంగ్‌ రూముల భద్రతపై సంబం ధిత తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించామని చెప్పారు. లోపాలకు తావులేకుండా సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్లు, ఓట్ల లెకి ్కంపు ప్రశాంతంగా జరిగేలా సహకరించాల న్నారు. ఈ పరిశీలనలో పలువురు సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:51 PM