విద్యుత్ కోతలతో అవస్థలు
ABN , Publish Date - May 30 , 2024 | 11:54 PM
గజపతినగరం పట్టణంలో ఎప్పటికప్పుడు విద్యుత్ కోతలు విఽధించడంపై పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గజపతినగరం: గజపతినగరం పట్టణంలో ఎప్పటికప్పుడు విద్యుత్ కోతలు విఽధించడంపై పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేళాపాళా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నిర్వహ ణ పనులు చేపడతున్నామనే పేరుతో వారానికి మూడు రోజులు రోజంతా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. మిగిలిన రోజులు రోజుకు ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తున్నదీ అధికారులకే ఎరుక. విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉండడం తో వ్యాపారులు తమ వ్యాపారాలు సాగడం లేదని వాపోతున్నారు. గత వారం రోజులుగా ఎండలు మండుతుండడంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోందని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగిసినంత వరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసిన అధికారులు ఎన్నికలు ముగిసిన తక్షణమే విద్యుత్ కోతలు విధిస్తుండడంతో ఇబ్బం దులకు గురవుతున్నామని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికా రులకు సమాచారం కోసం ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంపై మం డల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.