జైళ్లశాఖ డీఐజీ సందర్శన
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:11 AM
బొబ్బిలి సబ్‌జైలును ఆ శాఖ డీఐజీ రవికిరణ్ గురువా రం తనిఖీ చేశారు.

బొబ్బిలి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బొబ్బి లి సబ్‌జైలును ఆ శాఖ డీఐజీ రవికిరణ్ గురువా రం తనిఖీ చేశారు. జైలులో గల రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని, ఆహారాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన జైలు భవన నిర్మా ణం కోసం రెవెన్యూ అధికారులు రామన్నదొరవలస టిడ్కో కాలనీ సమీపంలో స్థలాన్ని కేటాయించారని చెప్పారు. ఇందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు విడుదలైన వెంటనే నిర్మాణాలకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జి డీఎస్‌జేవో శివప్రసాద్, స్థానిక సబ్‌జైలు సూపరింటెండెంట్ జి.సీతారాంపాత్రో, సిబ్బంది పాల్గొన్నారు.
పాలకొండ, డిసెంబరరు 26 (ఆంధ్రజ్యోతి): పాల కొండ సబ్ జైలును జైళ్లశాఖ డీఐజీ ఎం.రవి కిరణ్ గురువారం సందర్శించారు. జైలు పరిసర ప్రాంతా లను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. స్టోర్‌రూం, బాత్‌రూమ్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సబ్‌జైలు ప్రాంగణంలో మొక్కలు నాటారు. జైల్లో ఉన్న ముద్దాయిల యోగ క్షేమాలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సాధారణ తనిఖీల్లో భాగంగా పాల కొండ సబ్‌జైలును సందర్శించినట్టు తెలిపారు. జిల్లా జైలు శాఖాధికారి కె.మోహన్‌రావు, జైలు సూపరింటెండెంట్ బి.జోగులు, హెడ్‌వార్డర్లు పాల్గొన్నారు.