ప్రసాదం సమర్పయామి..
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:16 PM
ధనుర్మాసోత్సవాల సందర్భంగా సాలూరులోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, పెదకోమటిపేట రామాలయంలో గోదా రంగనాథస్వామికి కుడారై వెల్లుం (విశేష ప్రసాద సేవ)ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

సాలూరు రూరల్, జనవరి 12: ధనుర్మాసోత్సవాల సందర్భంగా సాలూరులోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, పెదకోమటిపేట రామాలయంలో గోదా రంగనాథస్వామికి కుడారై వెల్లుం (విశేష ప్రసాద సేవ)ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుత్వికులు నారాయణాచార్యులు, ఉదయభాస్కరాచార్యులు, జగన్నాథాచార్యులు శాస్త్రోక్తంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 108 కలశాలతో ప్రసాద నివేదన చేశారు. 27వ పాశుర తిరుప్పావైను పఠించారు. స్వామికి వివిధ కైంకర్యాలను సంపద్రాయబద్ధంగా నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.