పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు
ABN , Publish Date - Dec 16 , 2024 | 12:05 AM
పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని, ఆయన త్యాగనిరతిని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం పురస్కరించుకుని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం సభ ఏర్పాటు చేశారు.
పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు
ఆయన త్యాగనిరతి అందరికీ తెలియాలి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని, ఆయన త్యాగనిరతిని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం పురస్కరించుకుని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం సభ ఏర్పాటు చేశారు. తొలుత ఆయన చిత్రపటానికి మంత్రితో పాటుకలెక్టర్ అంబేడ్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి మనకు ప్రత్యేక గుర్తింపును తేవడానికి ప్రాణ త్యాగం చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను, స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలని, ప్రతి విద్యార్థి ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలని చెప్పారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ మరణించి కూడా అమరజీవిగా నిలిచిపోయారంటే, ఆయన త్యాగం ఎంత గొప్పదో తెలుస్తోందని అన్నారు. కార్యక్ర మంలో డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, బీసీ సంక్షేమేధికారి పెంటోజీరావు, డీఈవో మాణిక్యంనాయుడు, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీపీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.