Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ పూర్తి చేయాలి

ABN , Publish Date - May 08 , 2024 | 11:10 PM

పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. జేఎన్‌టీయులో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఆమె బుధవారం పరిశీలించారు. వీలైనంత వేగంగా పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ పూర్తి చేయాలి
ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లపై సూచనలిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

పోస్టల్‌ బ్యాలెట్‌ పూర్తి చేయాలి

జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి

కలెక్టరేట్‌, మే 8: పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. జేఎన్‌టీయులో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఆమె బుధవారం పరిశీలించారు. వీలైనంత వేగంగా పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. అలాగే ఎన్నికల రోజు ఏర్పాటు చేసే రిసెప్షన్‌ సెంటర్‌ వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని ఇన్‌చార్జులను ఆదేశించారు. స్ర్టాంగ్‌ రూముల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. నిర్దేశిత నమూనాలో కట్టుదిట్టంగా స్ర్టాంగ్‌ రూముల వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 13న ఎన్నికల జరుగుతున్నా దృష్ట్యా పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి 11వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 7గంటల వరకూ మద్యం విక్రయాలపై నిషేధం ఉంటుందని, మద్యం దుకాణాలను మూసి ఉంచాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు. అలాగే జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ రోజు కూడా మద్యం దుకాణాలు మూసివేసి ఉంచాలని తెలిపారు.

Updated Date - May 08 , 2024 | 11:10 PM