Share News

పది గ్రామాల్లో పోలీసు పికెటింగ్‌

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:36 AM

పార్వతీపురం సర్కిల్‌ పరిధిలోని 10 గ్రామాల్లో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్టు పార్వతీపురం రూరల్‌ సీఐ రవికుమార్‌ తెలిపారు.

 పది గ్రామాల్లో పోలీసు పికెటింగ్‌

సీతానగరం: పార్వతీపురం సర్కిల్‌ పరిధిలోని 10 గ్రామాల్లో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్టు పార్వతీపురం రూరల్‌ సీఐ రవికుమార్‌ తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడిన తర్వాత మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ఆయన శనివారం సం దర్శించారు. ఈసందర్భంగా ఆయన స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మాట్లాడుతూ శనివా రం సాయంత్రం నుంచి ఈ నెల 5వ తేదీ వరకు పికెటింగ్‌ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. సీతానగరం మండలంలోని పెదభోగిల, వెన్నెల బుచ్చమ్మపేట, బలిజి పేట మండలంలోని అజ్జాడ, చిలకల పలగర్ర పార్వతీపురం మండలంలోని ఎంఆర్‌ నగర్‌, బందలుప్పి, కొమరాడ మండలంలోని వన్నాం, దలాయిపేట, మాదలింగి గ్రామాల్లో పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే పెద్దఎత్తున బైండోవర్‌ కేసులు నమోదు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామాల్లో ఎటువంటి ఆనందోత్సవాలు నిర్వహించినా, పటాసులు కాల్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jun 02 , 2024 | 12:36 AM