మంత్రికి పీహెచ్‌సీ వైద్యుల వినతి
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:40 PM
పీహెచ్‌సీ వైద్యులకు పోస్ట్ గ్రాడ్యు యేషన్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటాను కొనసాగించాలని కోరుతూ జిల్లా పీహెచ్‌సీ వైద్యుల సంఘం ప్రతిని ధులు మంత్రి సంధ్యారాణిని కోరారు.

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఐదేళ్లగా సేవలందిస్తున్న పీహెచ్‌సీ వైద్యులకు పోస్ట్ గ్రాడ్యు యేషన్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటాను కొనసాగించాల ని కోరుతూ జిల్లా పీహెచ్‌సీ వైద్యుల సంఘం ప్రతిని ధులు రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కోరారు. ఈ మేరకు ఆదివారం సాలూరులోని తన స్వగృహంలో ఆమెను కలిసి, వినతిపత్రం అందజేశారు.పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ఇన్ సర్వీస్ కోటా 50 శాతం పీహెచ్‌సీ వైద్యులకు అమలు చేయాలని కోరారు. ఈ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు.