Share News

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:29 AM

అనుమానాస్పద స్థితిలో పాచి పెంట గ్రామానికి చెందిన డోల శంకరరావు(36) గురువారం ఉద యం మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పాచిపెంట, ఏప్రిల్‌ 11: అనుమానాస్పద స్థితిలో పాచి పెంట గ్రామానికి చెందిన డోల శంకరరావు(36) గురువారం ఉద యం మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ నారాయణరావు వివరాల ప్రకారం శంకరరావు మృతదేహం మండలంలోని పి.కోనవలస స మీపంలో గల పెద్దగెడ్డకు ఆనుకుని ఉన్న కర్రివలస, వేగావతి ఆన కట్ట ఎడమ కాలువ పక్కన కనిపించింది. ఆ సమీపంలో గల చీపు రువలస గ్రామస్థులు చూసి పోలీసులకు సమాచారం అందించా రు. వెంటనే ఎస్‌ఐ నారాయణరావు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. మృతదేహానికి శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమి త్తం సాలూరు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ నారాయణరావు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:29 AM