పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:00 AM
ఉపాధి హామీ పనులు చేసిన వేతనదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించా లని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి సభ్యులు దూసి దుర్గారావు డిమాండ్ చేశారు.

పాలకొండ: ఉపాధి హామీ పనులు చేసిన వేతనదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించా లని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి సభ్యులు దూసి దుర్గారావు డిమాండ్ చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో పూట ఉపాధి పని రద్దు చేయాలని కోరారు. యంత్రాలు పెరగడంతో వ్యవసాయ పనులు బాగా తగ్గిపోయి కూలీలు వలస వెళ్లే ప్రమాదం ఉందన్నారు. 200 రోజులు పనిదినాలు కల్పించాలన్నారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ నిరసనలో సీఐటీ యూ పాలకొండ మండల కమిటీ కార్యదర్శి కాద రాము, వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు పిట్ట త్రినాఽథ, ఎన్ని యశోదమ్మ, బి.అంకమ్మ, పట్నాన సరోజని, కూర్మాన రాములమ్మ, గొట్టాపు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.