Share News

సిమెంట్‌ లెక్కలపై పీడీ ఆరా

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:23 AM

మండలంలో లెక్క తప్పిన సిమెంట్‌ వ్యవహారంపై డీ ఆర్‌డీఏ పీడీ, మండల పరిషత్‌ ప్రత్యేకాధికారి కల్యాణ చక్రవర్తి ఎట్టకేలకు దృష్టి సారించారు.

సిమెంట్‌ లెక్కలపై పీడీ ఆరా

రేగిడి, ఫిబ్రవరి 1: మండలంలో లెక్క తప్పిన సిమెంట్‌ వ్యవహారంపై డీ ఆర్‌డీఏ పీడీ, మండల పరిషత్‌ ప్రత్యేకాధికారి కల్యాణ చక్రవర్తి ఎట్టకేలకు దృష్టి సారించారు. పీఆర్‌ ఏఈ రామకృష్ణ ఈ వ్యవహారంలో అధికారులు, నేతల ఒత్తి ళ్లతో ఆత్యహత్యకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. అసలు ఏం జరిగందనే దానిపై స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీడీవో శ్యామలాకుమారి, ఇంజినీరింగ్‌ సిబ్బందితో సమీక్షించారు. ఒక్కో సచివాలయానికి ఎంత సరఫరా అయింది? భవనాల ప్రగతి, ఇతర సచివాల యాలకు సర్దుబాటైన వివరాలు ఇంజి నీరింగ్‌ అసిస్టెంట్‌ల నుంచి సేకరించినట్లు పీడీ వెల్లడించారు. అప్పట్లో భవన నిర్మాణాల ప్రగతి పెద్దగా లేకపోగా, సిమెంట్‌ పాడవుతుంద నే ఉద్దేశంతో ఒక సచివాలయం నుంచి ఇతర సచివాలయా లకు సర్దుబాటు చేసినట్టు పీడీ గుర్తించారు. ఇది సక్రమంగా జరగలేదని అందరికీ తెలిసిందే అని నర్మగ ర్భంగా వ్యాఖ్యా నించారు. మండలంలో ఒకటి రెండు చోట్ల గడ్డలు కట్టి వంద లాది సిమెంట్‌ బస్తాలు పాడవడం, భవనాలు మంజూరై మూడేళ్లు గడిచినా, కొన్ని చోట్ల నిర్మించకపోవడం... కొన్నిచోట్ల అనధికార సర్దుబాట్లుపై పీడీని ప్రశ్నంచగా అన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు స్థానిక నేతలు, వైస్‌ ఎంపీపీలు టెంకాల అచ్చంనాయుడు, వి.జగన్మోహన రావు, వ్యవసాయ బోర్డు సలహా మండలి అధ్యక్షులు గేదెల వెంకటేశ్వరరావుతో సమావేశమై ఈనెల 5న నిర్వహించనున్న ఆసరా సమావేశంపై చర్చించారు.

Updated Date - Feb 02 , 2024 | 12:23 AM