Share News

పింఛన్‌ కోసం పడిగాపులు

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:00 AM

పింఛన్‌దారులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడంతో మండలంలోని పలు గ్రామాలకు చెందిన పింఛన్‌దారులు సోమవారం స్థానిక భారతీయ స్టేట్‌బ్యాంకు వద్ద తీవ్ర అవస్థలకు గురయ్యారు.

పింఛన్‌ కోసం పడిగాపులు

గజపతినగరం: పింఛన్‌దారులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడంతో మండలంలోని పలు గ్రామాలకు చెందిన పింఛన్‌దారులు సోమవారం స్థానిక భారతీయ స్టేట్‌బ్యాంకు వద్ద తీవ్ర అవస్థలకు గురయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పింఛన్‌దారులు విత్‌డ్రా ఫాం రాసుకునేందుకు బ్యాంకు వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర పింఛన్‌దారులతో బ్యాంకు కిటికిటలాడింది. సర్వర్‌ ఇబ్బందులతో పింఛన్‌దారులు కొంత సమయం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈనెలతో తమ ఇబ్బందులు తొలగిపోతాయని, వచ్చే నెలలో ఏ ప్రభుత్వం వచ్చినా నేరుగా ఇంటికి పింఛన్‌ వస్తుందని పింఛన్‌దారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బొబ్బిలి: పింఛన్‌ డబ్బుల కోసం సోమవారం బొబ్బిలి పట్టణంలోని పలు బ్యాంకుల ముందు పింఛన్‌దారులు పడిగాపులు కాశారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, మహిళలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

ఇంకెన్నాళ్లు మాకు ఈ పాట్లు

ఇంకెన్నాళ్లు నాయనా.. మాకు ఈ పాట్లు.. ఎలక్షన్‌ అయిపోయి 15 రోజులు దాటిపోయింది. అయినా మాకు ఈ పింఛన్‌ కష్టాలు తప్పడం లేదు. ఎండల్లో ఇబ్బందులు పడి బ్యాంకులకు వస్తున్నాం. ఇక్కడ వెంటనే పని జరగకపోవడంతో గంటల కొద్దీ వేచి ఉంటున్నాం. అష్టకష్టాలు పడుతున్నాం.

- రమణమ్మ, పింఛన్‌దారులు, బొబ్బిలి

Updated Date - Jun 04 , 2024 | 12:00 AM