అందరి అభివృద్ధే మా ఆశయం
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:10 AM
ప్రజాసేవ చేసే అవకాశం రావడం ఆనందదాయకమని, అందరి అభివృద్ధే ఆశయంగా పనిచేస్తానని చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికార సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

బొండపల్లి: ప్రజాసేవ చేసే అవకాశం రావడం ఆనందదాయకమని, అందరి అభివృద్ధే ఆశయంగా పనిచేస్తానని చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికార సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆది వారం తొలిసారి మండలానికి విచ్చేసిన ఆయనకు ప్రజలు ఘనంగా స్వాగతం పలి కారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగిం చిన బాధ్యతతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బలోపేతం చేసేందుకు కృషి చేస్తాన న్నారు. అలాగే మహిళల జీవనోపాధి, పేదరిక నిర్మూళనకు స్వయం సహాయక సం ఘాలను బలోపేతం చేసి, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా పథకాలు రూపొందిస్తామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బొడ్డు రాముతోపాటు కొత్తపాలెం, కెర టాం, చినతామరాపల్లి, రయింద్రం, బోడసింగిపేట సర్పంచ్‌లు బొడ్డు సత్యవతి, నం బూరి రాజేష్ (బుజ్జన్న), దేవుపల్లి ఉప సర్పంచ్ రాపాక అచ్చింనాయుడు, భాస్కర్ నాయుడు, ముదునూరు శ్రీనివాసరాజు, మీసాల జానకిరావుతోపాటు కనిమెరక నాయకులు పడాల అప్పలనాయుడు, బండారు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
గంట్యాడ: రాష్ట్ర చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండ పల్లి శ్రీనివాస్‌కు మండల ప్రజలు, టీడీపీ నాయకులు నీరాజనం పలికారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారిగా ఆయన ఆదివారం స్వగ్రామమైన గంట్యాడకు వచ్చారు. ముందుగా కొటారుబిల్లి కూడలిలో మంత్రికి స్థానికులు స్వాగతం పలికారు. అనంతరం గంట్యాడకు చేరుకుని గ్రామదేవత ఎల్లమాంబను మంత్రి దంపతులు దర్శించుకున్నారు. అక్కడ నుంచి కొండపల్లి స్వగృ హానికి చేరుకుని తాత పైడితల్లినాయుడు, మామ్మ చిన్నఅప్పయ్యమ్మ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళుల్పరించారు. అనంతరం కొండపల్లి పూజ గదిలో పూజలు చేశారు. అక్కడ కుటుంబీకులు, బంధువులు ఆశీర్వాదం తీసుకున్నారు. టీడీపీ మం డల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, స్థానిక టీడీపీ నాయుకులు, అధికారులు పాల్గొన్నారు.
గజపతినగరం: రాష్ట్ర చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమల శాఖా మంత్రి తొలిసారిగా నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ కార్యాలయానికి ఆదివారం రావడంతో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తొలిసారి మంత్రి పదవిలో నియోజకవర్గానికి రావడంతో పుష్పగుచ్ఛాలు, బొకేలతో స్వాగతించారు. అన్ని శాఖల అధికారులు మంత్రిని కలిసి, అభినందనలు తెలిపారు. బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.