సీఆర్‌టీల రెన్యువల్‌కు ఉత్తర్వులు
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:47 PM
సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్‌టీ)ను రెన్యువల్ చేస్తూ గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సీతంపేట: సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్‌టీ)ను రెన్యువల్ చేస్తూ గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 1,284 మంది సీఆర్‌టీలు విధులు నిర్వహిస్తుండగా సీతంపేటలో 250 మంది వరకూ ఉన్నారు. అయితే గతనెల12న పాఠశాలలో పునః ప్రారంభం అయినప్పటికీ వారికి రెన్యువల్‌కు సంబంధించి ఆదేశాలు రాలేదు. ఈ విషయాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ... వచ్చే ఏడాది ఏప్రిల్-30 వరకు వారిని రెన్యూవల్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై సీఆర్‌టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.