Share News

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకిరికి గాయాలు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:15 AM

గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయని రాజాం టౌన్‌ సీఐ దాడి మోహనరావు తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకిరికి గాయాలు

రాజాం రూరల్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయని రాజాం టౌన్‌ సీఐ దాడి మోహనరావు తెలిపారు. గత నెల 29న అర్ధరాత్రి దాటాక తెర్లాం మండలం చీకటిపేటకు చెందిన అక్కివరపు బంగారి, కొన్న నగేష్‌ రాజాం నుంచి తన స్వగ్రామానికి నడిచి వెళ్తుండగా రాజ య్యపేట జంక్షన్‌ వద్ద గుర్తు తెలియని వాహనం వారిద్దరినీ ఢీకొంది. ఈ ప్రమా దంలో అక్కివరపు బంగారి తీవ్ర గాయాలపాలయ్యాడు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని కిమ్స్‌లో చేరారు. అక్కడి నుంచి వచ్చిన మెడికల్‌ ఇంటి మేషన్‌ మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 12:15 AM