Share News

మరోసారి అసమ్మతి స్వరం

ABN , Publish Date - Jan 01 , 2024 | 01:02 AM

శృంగవరపుకోట నియోజకవర్గంలో అధికార పార్టీ లో మరోసారి అసమ్మతి స్వరం వినిపించింది. ఈసారి స్థానికునికే పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలనే నినాదం తెరపైకి వచ్చింది. 2004 సంవత్సరంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ స్థానికులకే ఇవ్వాలనే నినాదాన్ని తీసుకొచ్చి అప్పట్లో సాధించుకున్నారు. ఆ తరువాత ఇప్పటి వరకు స్థానికులకే టిక్కెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ రాలేదు.

మరోసారి అసమ్మతి స్వరం

కొత్తవలస, డిసెంబరు 31: శృంగవరపుకోట నియోజకవర్గంలో అధికార పార్టీ లో మరోసారి అసమ్మతి స్వరం వినిపించింది. ఈసారి స్థానికునికే పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలనే నినాదం తెరపైకి వచ్చింది. 2004 సంవత్సరంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ స్థానికులకే ఇవ్వాలనే నినాదాన్ని తీసుకొచ్చి అప్పట్లో సాధించుకున్నారు. ఆ తరువాత ఇప్పటి వరకు స్థానికులకే టిక్కెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ రాలేదు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ టిక్కెట్‌ స్థానికులకే ఇవ్వాలని శనివారం రాత్రి ప్రస్తుత శాసన సభ్యుడు కడుబండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా కొత్తవలసలో సమావేశమైన నాయ కులు తీర్మానం చేశారు. ఫ వైఎస్‌ జగన్‌ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేసిన తిరుమల పాదయాత్రను విజయ వంతంగా పూర్తి చేసినందుకుగాను రఘురాజు దంపతులకు సన్మానం ఏర్పాటు చేశా రు. కొత్తవలసలోని కొప్పల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నె క్కల నాయుడుబాబు కార్యాలయంలో శనివారం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు సమావేశమయ్యా రు. స్థానిక నేతకే ఈసారి టిక్కెట్‌ ఇస్తే గెలిపించుకుని తీసుకువచ్చి జగన్మోహాన్‌రెడ్డికి బహుమతి(గిఫ్టు) గా ఇస్తామని తీర్మానం చేశారు. ప్రస్తుత శాసన సభ్యుడు కడుబండిశ్రీనివాసరావుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, తాము ఎంత కష్టించి పనిచేసినా ప్రయోజనం ఉండే అవకాశాలు లేవని కొంతమంది నాయకులు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో వైసీపీ నుంచి ఎవరిని పోటీలో ఉంచినా విజయం సాధించడం జరిగిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేనందున స్థానికుడు ఉంటే తప్ప విజయం సులువు కాదన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ స్థానికునికే టిక్కెట్‌ ఇవ్వడం సమంజసమని, తనకు టిక్కెట్‌ ఇవ్వాలని అడగడం లేదని, నియోజకవర్గానికి చెందిన ఏ మండలానికి చెందిన నాయకునికి ఇచ్చినా అందరం కలిసి కట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని తాను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. సమావేశానికి వైఎస్‌ఆర్‌ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి నవరత్నాల కార్యక్రమ వైస్‌ చైర్మన్‌ అంకం రెడ్డి నారాయణ మూర్తి, పార్టీ పంచాయతీరాజ్‌ వింగ్‌ జోనల్‌ ఇన్‌చార్జ్‌ మెరపల సత్యన్నారాయణ, పార్టీ జిల్లా కార్యదర్శి గుడివాడ రాజేశ్వరరావు, జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, వైస్‌ ఎంపీపీ మేలారస్ర్తి అప్పారావు, ఎంపీటీసీ బాబి, ఎస్‌ కోట ఎంపీపీ సొండి సోమేశ్వరరావు, వైస్‌ఎంపీపీ ఇందుకూరి సుధారాజు, వేపాడ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 01:02 AM