Share News

ఓ మై ‘ఘాట్‌’

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:32 PM

చప్పగొత్తిలి- ఆవిరి గ్రామాల మధ్య గల ఘాట్‌ రోడ్డు ప్రమాదకరంగా మారింది. అసలే ఈ మార్గం ఇరుకుగా ఉండగా.. దారి పొడవునా భారీ గోతులు ఏర్పడ్డాయి. దీనికి తోడు రోడ్డు ఒకవైపు భారీ లోయ, మరోవైపు కొండ ఉంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. 300 అడుగుల కింద ఉన్న గెడ్డలో పడే ప్రమాదముంది.

ఓ మై ‘ఘాట్‌’
పులిపుట్టి గ్రామం వద్ద ఘాట్‌ రోడ్డు ఇలా..

చప్పగొత్తిలి- ఆవిరి గ్రామాల మధ్య గల ఘాట్‌ రోడ్డు ప్రమాదకరంగా మారింది. అసలే ఈ మార్గం ఇరుకుగా ఉండగా.. దారి పొడవునా భారీ గోతులు ఏర్పడ్డాయి. దీనికి తోడు రోడ్డు ఒకవైపు భారీ లోయ, మరోవైపు కొండ ఉంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. 300 అడుగుల కింద ఉన్న గెడ్డలో పడే ప్రమాదముంది. ఇప్పటికే తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. ఘాట్‌రోడ్డులో రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిత్తిరి పంచాయతీ గ్రామాలకు చేరుకోవాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని, ఘాట్‌ రోడ్డులో మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని, లోయ ఉన్న చోట్ల రిటైనింగ్‌వాల్‌ నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- కురుపాం రూరల్‌

Updated Date - Jul 05 , 2024 | 11:32 PM