Share News

కమాండ్‌ కంట్రోల్‌ రూం పరిశీలన

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:34 PM

ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంను సోమవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పరిశీలించారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూం పరిశీలన

పార్వతీపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంను సోమవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కంట్రోల్‌ రూమ పనితీరుపై ఆరా తీశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. క్షేత్ర స్థాయిలో వ్యయ ఖర్చులు, ప్రకటనలు, ప్రచారాలు, కార్యక్రమాలు ఇతర అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఎంపీసీ, ఎఫ్‌ఎస్‌టీ, వీఎస్‌టీ, వీవీటీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు సమర్థంగా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన సమయంలోగా నివేదికలను పంపించాలని సూచించారు. ఈ పరిశీలనలో కంట్రోల్‌ రూం ఇన్‌చార్జి, జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, ఇన్‌చార్జి డీఆర్వో కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణ, నోడల్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:34 PM