Share News

అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి ఉంటా

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:28 AM

టీడీపీ అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు.

అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి ఉంటా

నెల్లిమర్ల: టీడీపీ అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. నెల్లిమర్లలో గురువారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు ఎమ్మెల్యే టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించానని.. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తనను పిలిపించి.. ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని భరోసా ఇచ్చారని తెలిపారు. దీంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌, జోన్‌-1 సమన్వయ కర్త శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్‌, భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, డెంకాడ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, పసుపులేటి గోపి, ఆకిరి ప్రసాదరావు, జిల్లా అఽధికార ప్రతినిధి గేదెల రాజారావు, జిల్లా కార్యదర్శి లెంక అప్పలనాయుడు, బయిరెడ్డి లీలావతి, అట్టాడ బుజ్జి, అవనాపు సత్యనారాయణ పాల్గొన్నారు.

25 కుటుంబాల చేరిక

నెల్లిమర్ల మండలంలోని టెక్కలి మాజీ సర్పంచ్‌, వైసీపీ నాయకుడు నేతేటి అప్పలనాయుడు గురువారం 25 కుటుంబాలతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లిమర్లలో గురువారం జరిగిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌, మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:28 AM