Share News

ఏజెన్సీలో పౌష్టికాహారం అందడం లేదు

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:09 AM

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదని కురుకూటి ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారావు సాలూరు సీడీపీవో సత్యవతిని నిలదీశారు. సోమవారం సాలూరు మండల పరిషత్‌ సమావేశం ఎంపీపీ రాములమ్మ అధ్యక్షతన, వైస్‌ ఎంపీపీ రెడ్డి సురేష్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె వల్ల గ్రామసచివాలయ సిబ్బందికి కేంద్రాల నిర్వహణ బాధ్య తలను అప్పగించారని, వారికి బాధ్యతలు ఇవ్వడం వల్ల గర్భిణులు,బాలింతలకు ఇన్ని రకాల రేషన్‌ ప్రభుత్వం వస్తున్నాయా అని గిరిజనులకు తెలిసిందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఏజెన్సీవాసులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందిం చలేదని సీడీపీవో దృష్టికి తీసుకెళ్లారు.

ఏజెన్సీలో పౌష్టికాహారం అందడం లేదు

సాలూరు రూరల్‌: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదని కురుకూటి ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారావు సాలూరు సీడీపీవో సత్యవతిని నిలదీశారు. సోమవారం సాలూరు మండల పరిషత్‌ సమావేశం ఎంపీపీ రాములమ్మ అధ్యక్షతన, వైస్‌ ఎంపీపీ రెడ్డి సురేష్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె వల్ల గ్రామసచివాలయ సిబ్బందికి కేంద్రాల నిర్వహణ బాధ్య తలను అప్పగించారని, వారికి బాధ్యతలు ఇవ్వడం వల్ల గర్భిణులు,బాలింతలకు ఇన్ని రకాల రేషన్‌ ప్రభుత్వం వస్తున్నాయా అని గిరిజనులకు తెలిసిందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఏజెన్సీవాసులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందిం చలేదని సీడీపీవో దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయంపైౖ ఖరాసవలస ఎంపీటీసీ అప్పికొండ రమాదేవి సైతం సుబ్బారావుతో ఏకభవించారు. తోణాం పీహెచ్‌సీ వైద్యాధికారి సుజాతచర్చలో జోక్యం చేసుకుని తమ ఆసుపత్రికి వచ్చే ఏజెన్సీలో కొందరు గర్భిణులు పౌష్టికాహారం అందడంలేదని చెప్పారని స్పష్టం చేశారు. దీంతో వైస్‌ ఎంపీపీ రెడ్డి సురేష్‌ మాట్లాడుతూ ఈవిషయంపై సీడీపీవో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఉపాధి పనికి రెండు పూటలా కూలీలు వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని ఏపీవో రామకృష్ణనాయుడు కోరారు. సమావేశం కేవలం గంట 15 నిమిషాల్లో ముగించారు. సమావేశంలో రెండవ వైస్‌ ఎంపీపీ గుణవతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రెడ్డి పద్మావతి,శివరాంపురం ఎంపీటీసీ కళ్లేపల్లి త్రినాథనాయుడు,ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:09 AM