అవయవ దానంతో తొమ్మిది మందికి మేలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:36 AM
ఒక వ్యక్తి అవయవ దానంతో తొమ్మిది మంది ప్రాణా లు నిలబెట్టవచ్చని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు.
సాలూరు: ఒక వ్యక్తి అవయవ దానంతో తొమ్మిది మంది ప్రాణా లు నిలబెట్టవచ్చని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవయవ దానంపై శుక్రవారం పట్టణంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని అన్నారు. అందరిముందే అవయవ దానం పత్రాలపై సంతకం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ప్రభుత్వ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు గణేశ్వరరావు, పెంట శ్రీనువాసరావు, సీఐ అప్పలనాయుడు, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, ముఖీ సూర్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ ఉష, నిర్వాహకులు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.