Share News

నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:26 AM

ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు.

 నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

నెల్లిమర్ల: ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు. మండలంలోని దన్నానపేట, సీతారామునిపేట, గొర్లెపేట, ఎటి అగ్రహారం, కొత్తపేట గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ, జనసేన నాయకులతో ఆయా గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలను కలిశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. రానున్న ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, జిల్లా కార్యదర్శి లెంక అప్పలనాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:26 AM