లోకేశ్‌ను కలిసిన నాగార్జున
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:04 AM
‘మీ రాజకీయ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తున్నాను. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి మీరిచ్చిన రాజీనామాను ఉపసంహరించుకోండి.’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. కిమిడి నాగార్జునకు హామీ ఇచ్చారు.

చీపురుపల్లి: ‘మీ రాజకీయ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తున్నాను. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి మీరిచ్చిన రాజీనామాను ఉపసంహరించుకోండి.’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. కిమిడి నాగార్జునకు హామీ ఇచ్చారు. చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి టికెట్ ఆశించి, భంగపడిన నాగార్జున మంగళవారం విజయవాడ లో లోకేశ్‌ను కలిశారు. ఆయనతో పాటు వచ్చిన నాలుగు మండలాల టీడీపీ నాయకులు.. పార్టీ కోసం నాగార్జున పడిన శ్రమను లోకేశ్‌కు వివరించారు. దీనికి లోకేశ్ స్పందిస్తూ.. ‘ఈ ఎన్నికల్లో కూడా పార్టీ తరపున జిల్లాలో ప్రచార బాధ్యతలను మీకే అప్పగిస్తున్నా ను. చీపురుపల్లి టికెట్‌ను ఆఖరి నిమిషం వరకూ మీకే ఇద్దామని పార్టీ భావిం చింది. అయితే చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల అభ్యర్థిని మార్పు చేయాల్సి వచ్చింది’ అని అన్నారు. దీనికి నాగార్జున తనకు నాలుగు రోజుల గడువు కావాలని, ఆ తర్వాత తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పారు.