Share News

ఉపసంహరించాల్సిందే..

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:05 PM

భారత న్యాయ సంహిత చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మోటార్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం సాలూరులోని 26వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

  ఉపసంహరించాల్సిందే..
సాలూరు హైవేపై రాస్తారోకో చేస్తున్న మోటార్‌ కార్మికులు

సాలూరులో రాస్తారోకో

సాలూరు రూరల్‌, జనవరి 7: భారత న్యాయ సంహిత చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మోటార్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం సాలూరులోని 26వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భారత న్యాయ సంహిత చట్లం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఈ చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌కు సంబంధించిన సెక్షన్‌ 109/2 మరింత కఠినంగా ఉందని చెప్పారు. ఈ సెక్షన్‌ వల్ల వాహన చోదకులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. తక్షణమే దీనిపై కేంద్రం పునరాలోచించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం సాలూరు సీఐ జి.దేవుడుబాబు అక్కడకు చేరుకుని చర్చించడంతో వారు ఆందోళన విరమించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. ఈ నిరసనలో ఏఐటీయూసీ జిల్లా నేత సిద్ధాబతుల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 11:05 PM