Share News

48 గంటల్లో రైతు ఖాతాలోకి డబ్బులు: విప్‌

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:20 AM

ww

  48 గంటల్లో రైతు ఖాతాలోకి డబ్బులు: విప్‌
కొమరాడ: రైతుకు ట్రక్‌షీట్‌ అందజేస్తున్న జగదీశ్వరి :

కొమరాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నట్లు ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. బుధవారం మండలంలోని గుణానుపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ట్రక్‌ షీట్లు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు

గరుగుబిల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి మిల్లర్లు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని తహసీ ల్దార్‌ పి.బాల హెచ్చరించారు. బుధవారం పెద్దూరులోని రైస్‌ మిల్లులు, రైతుసేవా కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆమె వెంట ఆర్‌ఐ శ్రీనివాస్‌ గౌరీప్రసాద్‌, కార్యదర్శి బి.అప్పారావు, జూనియర్‌ సహాయకులు గులిపల్లి రవితేజ ఉన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నాగూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొప్పల వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎ.మధుసూదనరావు ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ అరకు బీసీ సేల్‌ అధికార పార్టీ ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ, సిబ్బంది జోత్స్న పాల్గొన్నారు.

ఫ సాలూరు రూరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మామిడిపల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని తహసీల్దార్‌ ఎన్వీరమణ,ఏవో అనురాధపండ, టీడీపీ మండలాధ్యక్షుడు ఆముదాల పరమేశు డొంక అన్నపూర్ణ ప్రారం భించారు.కార్యక్రమంలో బూసతవుడు, చిన్నబాబు,భరత్‌ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు,సీఈవో యజ్ఞేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:21 AM