Share News

మాక్‌ పోలింగ్‌ తప్పనిసరి

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:07 AM

ఎన్నికల నియయాలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, మాక్‌ పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు.

 మాక్‌ పోలింగ్‌ తప్పనిసరి
మాట్లాడుతున్న కలెక్టర్‌

సీతంపేట: ఎన్నికల నియయాలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, మాక్‌ పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏ ఎస్సార్‌ శంకరన్‌ సమావేశ మందిరం, వైటీసీ, సీతంపేట సామాజిక భవనాల్లో నిర్వహించిన నియోజక పోలింగ్‌ అధికారుల శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ రోజు చేపట్టాల్సిన అన్ని అంశాలు, ఈవీఎంల పనితీరుపై విధిగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నిర్దిష్ట సమయానికి పోలింగ్‌ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ సందేహా లున్నా ఇప్పుడే నివృత్తి చేసుకోవాలని, రీపోలింగ్‌ చేసే అవకాశం రాకుండా చూడాలని ఆదేశించారు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సంబంధిత సెక్టార్‌ అధికారులకు తెలియ జేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో కల్పనాకుమారి, నాలుగు మండలాల తహసీల్దార్లు, మాస్టర్‌ ట్రైనీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చెక్‌పోస్టు పరిశీలన

పాలకొండ: వెలగవాడ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టులోని రికార్డులు పరిశీలించారు. ఎన్నికల నేపఽథ్యంలో ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. అక్రమంగా డబ్బు రవాణా, మాదక ద్రవ్యాలు తరలిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. అధిక మొత్తంలో డబ్బు ఉంటే దానికి సంబంధించిన పత్రాలు పక్కాగా ఉండాలని, లేకపోతే సీజ్‌ చేయాలని తెలిపారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ జీవీ కృష్ణారావు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:07 AM