Share News

ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే సమీక్ష

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:04 AM

నియోజకవర్గంలో గత ప్రభుత్వహయాంలో మం జూరైన ఇళ్ల నిర్మా ణాలపై ఎస్‌.కోటఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి జిల్లా ప్రాజెక్టుడైరెక్టర్‌ వి. శ్రీనివాస్‌తో సమీక్షించారు.

  ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే సమీక్ష

లక్కవరపుకోట: నియోజకవర్గంలో గత ప్రభుత్వహయాంలో మం జూరైన ఇళ్ల నిర్మా ణాలపై ఎస్‌.కోటఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి జిల్లా ప్రాజెక్టుడైరెక్టర్‌ వి. శ్రీనివాస్‌తో సమీక్షించారు. ఆదివారం లక్కవరపుకోటలో పీడీతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 75 వేల ఇళ్లు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ద్వారా మంజూరయాయ్యని, ఇందులో 42 వేల ఇళ్లు పూర్తయ్యాయని మిగిలినవి వివిదదశల్లో ఉన్నాయని,మార్చి 2025 నాటికి పూర్తిచేస్తామని పీడీ వివరించారు.ఇంకా కావాల్సిన వారికి డైరెక్షన్స్‌ రావా లన్నారు. అనంతరం సిమెంట్‌ గోదామును తనిఖీ చేశారు.కార్యక్రమంలో డీఈ శ్రీనివాసరావు, ఏఈ ఉమామహేశ్వరరావు, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:04 AM