త్రుటిలో తప్పింది ...
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:12 PM
పార్వతీపురం నుంచి గమ్మలక్ష్మీపురం వెళ్తున్న ఓ వ్యాను గుమ్మగదబవలస గ్రామ సమీపంలో మంగళవారం అదుపు తప్పింది.
పార్వతీపురం నుంచి గమ్మలక్ష్మీపురం వెళ్తున్న ఓ వ్యాను గుమ్మగదబవలస గ్రామ సమీపంలో మంగళవారం అదుపు తప్పింది. రక్షణ గోడలు లేని వంతెన అంచుకు చేరుకుని లోయవైపు దూసుకుపోయింది. అయితే అదృష్ణవశాత్తూ వ్యాను లోయలో పడకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వంతెన మలుపులో ఉండడం, దానికి రక్షణ గోడలు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- కురుపాం రూరల్